మంచిర్యాల 29ఏప్రిల్ : రామకృష్ణాపూర్ పట్టణంలోని ఠాగూర్ స్టేడియంలో నిర్వహించిన క్యాతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సభ జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. 22 వార్డుల నుంచి తరలివచ్చిన గులాబీ సైనికులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమం ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అధ్యక్షతన బిఆర్ఎస్ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. ముందుగా సూపర్ బజార్ సెంటర్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం సూపర్ చౌరస్తా నుండి ఠాగూర్ స్టేడియం వరకు డబ్బు చప్పులతో బతుకమ్మలతో భారీ ర్యాలీగా ఆత్మీయ సమ్మేళన సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ రూపాంతరం చెంది కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు అన్ని కులాలకు సమపాలనలో న్యాయం చేకూరి అభివృద్ధి విషయంలో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు.కొత్త సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని అన్నారు నాయకులు ప్రజల పక్షాన నిలుస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని దానికి తెలంగాణ రాష్ట్రం ఉదాహరణ అని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్యమంత్రి ఆత్మీయ సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం మున్సిపాలిటీ కొనసాగుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి 203.50 కోట్లతో అభివృద్ధి పనులు సాగుతున్నాయని అన్నారు. మున్సిపాలిటీ మిగిలిన ఏరియాలో 41.50 కోట్లతో మిషన్ భగీరథ పనులు చేపడుతున్నామని, గాంధారి వనం రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఎక్కడలేని శిల్పారామం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 22.50 కోట్లతో శ్రీనివాస గార్డెన్ నుండి గాంధారి వనం వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని 15 కోట్లతో రామకృష్ణపూర్ పట్టణంలో అన్ని ఏరియాల్లో రోడ్లు, 13 జంక్షన్ లను ఆధునికరిస్తున్నామని గతంలో రామకృష్ణాపూర్ పట్టణాన్ని ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు.ఎలాంటి అవినీతి లంచం ఆస్కారం లేకుండా అర్హులైన వారికి డబుల్ బెడ్ రూములు ఇండ్లు అందజేస్తున్నామని అన్నారు. సింగరేణి సంస్థ మన ప్రాంత ప్రజలతో వేసుకున్న అనుబంధం అని అన్నారు.32 వేల కోట్ల టర్నోవర్ 11వేల665 కోట్ల డిపాజిట్లు, ఏటా ఏడూ వందల యాభై కోట్ల వడ్డీ రాబడితో ఆ పాటు ఐదు వందల శాతం వృద్ధిరేటుతో 2వేల 300 కోట్ల లాభాలతో పూర్తి ఆర్థిక పరిపుష్టితో ఉన్న సింగరేణి సంస్థకు చెందిన బొగ్గు బ్లాకులను వేలం వేసి సింగరేణి భవిష్యత్తులో కేటాయించకుండా నష్టాల బాట పట్టించాలన్న కుతంత్రం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తుందని అన్నారు. దేశ ప్రజలను కాంగ్రెస్, బిజెపిలో నిండా ముంచాయని పాల నుండి స్మశాన వాటిక వరకు జీఎస్టీ విధించిన దుర్మార్గ పార్టీ బిజెపి అని అన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం డీజిల్ పై 512 శాతం పెట్రోల్ పై 192 శాతం చొప్పున ఎక్సైజ్ పనులు పెంచిందని, దీంతో ఉత్పాదక ఖర్చులు రవాణా చార్జీలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగే ఆ ప్రభావం అన్ని సరుకులు పడిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పాల నుంచి అంతక్రియల వరకు అన్ని రకాల వస్తువులు సేవలు మీద జిఎస్టి పెంచిందని దీంతో సామాన్యుల బ్రతుకులు మరింత భారమయ్యాని అన్నారు. సిలిండర్ పై 400 నుంచి 1200 కు పెంచిందని, పెట్రోల్ డీజిల్ పై 30 లక్షల కోట్ల సెన్సులు విధించిన కేంద్రం ఫలితంగా రవాణా వేయం ఉత్పత్తి ఖర్చు పెరిగే పప్పులు, ఉప్పుల రేట్లు బగ్గుమంటున్నాయని కాంగ్రెస్ బిజెపి రెండు ఒకే తను ముక్కలే అని అన్నారు. నేను మళ్ళీ చెన్నూరు గడ్డ నుండే పోటీ చేస్తానని భారీ మెజార్టీతో ప్రజల ఆశీర్వదించాలని దేశంలో గుణాత్మక మార్పు కోసం కేసీఆర్ ఢిల్లీలో పోరాటం చేస్తున్నారని వారికి దేశ ప్రజలందరి మద్దతు ఉండాలని అన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో కాంగ్రెస్ కు చెందిన కౌన్సిలర్ పనాసరాజు, సిపిఐ పార్టీకి చెందిన కౌన్సిలర్ మేకల తిరుమల బిఆర్ఎస్ పార్టీలో చేరారు.చెన్నూరు నియోజకవర్గంలో ఆత్మీయ సభలో అంతట ఒకే రకమైన ఆప్యాయత అనురాగాలతో కొనసాగుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, గ్రంధలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అజిజ్, టౌన్ ఇన్చార్జి గాండ్ల సమ్మయ్య, కేంగర్ల మల్లయ్య, చైర్ పర్సన్ జంగం కల, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, కంభవాని సుదర్శన్ గౌడ్, వార్డ్ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *