ఆదిలాబాద్ 29 ఏప్రిల్: గత 22 సంవత్సరాలుగా ఎస్టీ హోదా కోసం పోరాడుతున్న మాలీలు పూర్తిస్థాయిలో ఎస్టీ హోదా లభించే వరకు పోరాడుతూనే ఉంటారని మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే అన్నారు. అసిఫాబాద్ మండలం సాలెగూడా గ్రామపంచాయతీ పరిధిలోని పులాజి బాబా ధ్యాన మందిరం ముందర జరిగిన మాలీల ఆత్మ గౌరవ సభకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి మాలీలకు ఎస్టీల హోదా కల్పించాలని కేంద్రానికి తీర్మానం పంపడం అభినందనీయమని కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి మాలిలకు ఎస్టీల హోదా కల్పించాలని ఎస్టీ హోదా లభించేంతవరకు మాలీలు పోరాడుతూనే ఉంటారని అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మాలీల ఆత్మ భవనం కోసం స్థలం కేటాయించిన ఎమ్మెల్యే కోనేరు, కోనప్ప ఆత్రం సక్కు, కోవలక్ష్మి జిల్లా కలెక్టర్ లకు ధన్యవాదాలు తెలిపారు. భవన నిర్మాణం కోసం 20 లక్షలు కేటాయించడం టెండర్లు కూడా పూర్తి కావడం చేత వెంటనే పనులు పూర్తి చేయించాలని అదనంగా ఇంకా 20 లక్షలు సంఘభవనానికి మంజూరు చేయాలని కోరారు. మాలీలంతా ఐక్య పోరాటాల ద్వారానే హక్కులను సాధించుకోవచ్చని ఫూలే దంపతుల జయంతి వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కేవలం జయంతి మాత్రమే అధికారికంగా నిర్వహిస్తున్నారని అది కూడా మాలీల పోరాట ఫలితమేనని అన్నారు.
ఈ కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్ అలీ భాయ్, మార్కెట్ చైర్మన్, ఎంపిటిసి చిన్న మల్లన్న ,ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపా ధ్యక్షులు రేగుంట కేశవరావు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు రూపునాథ్ రమేష్, సంగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న సెండే ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు వాడగురే విజయ్, జిల్లా పటేళ్ల సంఘం అధ్యక్షులు నారాయణ షిండే, మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్ ,డివిజన్ అధ్యక్షులు మెంఘాజీ గ్రామ సర్పంచ్ ముంజం వినోద్, డ్రైవర్ యూనియన్ జాబిడి సురేష్ ,మాజీ సర్పంచ్ సోమేశ్వర్ శేండే ,తులసి రామ్ కావుడే, మండల అధ్యక్షులు బాపూరావు, వాంకిడి మండల అధ్యక్షులు వాడై బాపూరావు ప్రధాన కార్యదర్శి వాసు షిండే కోశాధికారి కృష్ణన్ షిండే గురునులే మారుతి కేలిబి సర్పంచ్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *